Abn logo
Jul 12 2020 @ 00:17AM

ఇండియా ఎంతో నచ్చింది.. ఇక్కడే ఉండేందుకు అనుమతివ్వండి: అమెరికన్

కొచ్చి: భారతదేశం తనకు ఎంతగానో నచ్చిందంటూ ఓ అమెరికన్ కోర్టుకెక్కారు. అదేంటి దేశం నచ్చితే కోర్టుకు వెళ్లడం ఏంటని అనుకుంటున్నారా? వివరంగా చెప్పాలంటే.. జానీ పాల్ పియర్స్(74) అనే అమెరికన్.. టూరిస్ట్ వీసాపై భారత్‌లోని కేరళకు కొద్ది నెలల క్రితం వచ్చారు. అయితే ఆయనకు కేరళ రాష్ట్రం ఎంతగానో నచ్చిందని.. తాను కేరళలోనే ఉండాలని నిశ్చయించుకున్నట్టు తెలిపారు. అయితే భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీయులు టూరిస్ట్ వీసాపై భారత్‌కు వస్తే ఇక్కడ కేవలం 180 రోజులు మాత్రమే ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత విదేశీయులు తమ దేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. కాగా.. జానీ పియర్స్ టూరిస్ట్ వీసా గడువు ఆగస్ట్ 24తో ముగియనుంది. దీంతో ఆయన కేరళ హైకోర్టుకు వెళ్లి తన టూరిస్ట్ వీసాను బిజినెస్ వీసాగా మార్చాలంటూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 24న విచారణ జరగనుంది.

Advertisement
Advertisement
Advertisement