Abn logo
Sep 17 2021 @ 00:00AM

ఐపీసీకి బదులు వైసీపీ సెక్షన్‌ అమలు

ఎమ్మిగనూరులో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బీవీ

  1. ఉండవల్లి ఘటనపై టీడీపీ నాయకుల మండిపాటు
  2. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌


రాష్ట్రంలో ఐసీపీ సెక్షన్‌కు బదులుగా వైసీపీ సెక్షన్‌ అమలవు తోందని టీడీపీ నాయకులు మండిపడ్డారు. చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌తోపాటు ఆయన అనుచరులు చేసిన దాడిని ఖండించారు. 


ఎమ్మిగనూరు, సెప్టెంబరు 16: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఒక మాజీ సీఎం ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడి జరిగితే డీజీపీ ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. జోగి రమేష్‌కు మంత్రి పదవి కావాలంటే సీఎం జగన్‌ ఇంటి ముందు ధర్నా చేయాలన్నారు. వైసీపీ నాయకులు డ్రామాలు అపాలని.. ఇలాగే అరాచకాలు చేస్తుపోతే ప్రజలు క్షమించరన్నారు. సమావేశంలో ప్రతాప్‌ ఉరుకుందయ్య శెట్టి, కేఎండీ ఫారుక్‌, సుందరాజు, రంగస్వామిగౌడ్‌, చేనేతమల్లి, కటారి రాజేంద్ర, కృష్ణతేజనాయుడు, సలీం, మిన్నప్ప, నరసింహులు, దేవేంద్రలు పాల్గొన్నారు. 


మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ధ్వజం


ఆదోని: జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడికే రక్షణ లేకపోతే ఎలా అని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు అన్నారు. శుక్రవారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. పోలీసులను గుప్పెట్లో పెట్టుకుని దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇంటి గేటు వరకు వెళ్లడం దారుణమని అన్నారు. రాజకీయ విమర్శలు ఓర్చుకోలేక పోతే ఎలా నాయకులయ్యారంటూ అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.


తొమ్మిదేళ్లు పాలించిన వ్యక్తికే భద్రత లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని టీడీపీ సీనియర్‌ నాయకులు గుడిసె శ్రీరాములు, దేవేంద్రప్ప, భాస్కర్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇంటి గేటు వరకు వెళ్లడం దారుణమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. 


ఆలూరు: రాష్ట్రంలో వైసీపీ నాయకులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి యత్నించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయన్నారు. 


రాష్ట్రంలో దొంగల రాజ్యం నడుస్తోందని తెలుగు రైతు కమిటీ రాష్ట్ర కార్యదర్శి నారాయణరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఇంటిపై వైసీపీ నాయకులు రాళ్లతో దాడికి యత్నించడం చూస్తే దౌర్జన్య పాలన స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సమావేశంలో టీడీపీ మండల కన్వీనర్‌ రాంభీంనాయుడు, నరసప్ప, కొమ్ము రామాంజి, జహీర్‌, నాగరాజు, సురేంద్ర, అనిల్‌, శేఖర్‌, గూల్యం రామాంజి పాల్గొన్నారు. 


కోసిగి: రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన కొనసాగుతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్‌ రెడ్డి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై రాళ్లదాడిని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి సల్మాన్‌ రాజు, తెలుగు యువత నాయకులు బసలదొడ్డి కృష్ణ, లక్ష్మారి చిదానంద, దుద్ది నాగేష్‌, బంగారప్ప, రామక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు


పెద్దకడబూరు: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని టీడీపీ రాష్ట్ర రైతు సంఘం అధికారి ప్రతినిధి రమాకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం పెద్దకడబూరులోని ఆయన స్వగృహంలో మాట్లాడుతూ దాడి ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు.


‘చంద్రబాబు ఇంటిపై దాడులు దుర్మార్గపు చర్య’


మంత్రాలయం: మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటిపైన వైసీపీ నాయకుల దాడి దుర్మార్గపు చర్యని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రి, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇంటిపైన దాడులు చేయించడం హేయమైన చర్య అన్నారు. దేశంలో రాష్ట్ర పరువును దిగజార్చిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రాన్నికి ఒక్క పరిశ్రమను తీసుకొని రాకుండా అథోగతిపాలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, పన్నగ వెంకటేశ్‌ ఉన్నారు.


కౌతాళం: రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్‌కు బదులు వైసీపీ సెక్షన్‌ అమలు అమలవుతోందని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చన్నబసప్ప అన్నారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఉండవల్లిలో నివాసం ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇంటిపై రాళ్ల దాడిని ఆయన ఖండించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసి జడ్‌ప్లస్‌ భద్రత ఉన్న చంద్రబాబునాయకుడి ఇంటిపైనే దాడికి యత్నించా రంటే ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ వైకరే ఆ పార్టీ అరాచకత్వానికి ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. రెండున్న రేళ్లకే తీవ్ర ప్రజా వ్యతిరేకతను వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొంటోదని, రానున్న రోజుల్లో భూస్థాపితం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమే అని ఘంటాపథంగా చెప్పారు. కార్యక్ర మంలో వెంకటపతిరాజు, కొట్రేష్‌గౌడ్‌, కురువ వీరేష్‌, రాజబాబు, మంజు, రాజానంద్‌, సిద్దు, రెహమాన్‌ పాల్గొన్నారు.


నారా చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వాల్మీకి ఫెడరేషన్‌ మాజీ డైరెక్టర్‌, టీడీపీ సీనియర్‌ నాయకులు ఉలిగయ్య అన్నారు. శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నాయకులు ప్రజా పాలన చేతగాక గూండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో అడివప్పగౌడ్‌, సురేష్‌నా యుడు, రామలింగ, సిద్దప్ప, గోవిందు పాల్గొన్నారు.


నందవరం: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దేశాయి మాధవరావు, మాజీ జడ్పీటీసీ ముగతి ఈరన్నగౌడు అన్నారు. శుక్రవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ తన వైసీపీ గూండాలతో చంద్రబాబు ఇంటిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెపుతారన్నారు.


గోనెగండ్ల: మాజీ సీఎం, టీడీపీ జాతీయ ఆధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని గోనెగండ్ల మండల టీడీపీ నాయకులు నజీర్‌సాహెబ్‌, నూరహమ్మద్‌, దరగలమాబు, తిరుపతయ్యనాయుడు, చెన్నలరాయుడు, మదీనా, మిన్నల్ల డిమాండ్‌ చేశారు. శుక్రవారం వారు మాట్లాడుతూ చంద్రబాబు ఇంటిపై ఎమ్మెల్యే జోగి రమేష్‌ తన గూండాలతో దాడికి పాల్పడటం పిరికి పంద చర్యగా అభివర్ణించారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు ఇలాంటి చర్యలను మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కొత్తింటి ఫకృద్దీన్‌, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.