Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎట్టకేలకు పెళ్లి జరుగుతోందనే ఆనందంలో ఆ వరుడు చేసిన పనికి బంధువులందరూ షాక్!

పెళ్లి వేడుక అనేది ఎవరికైనా జీవితంలో ఓ మధుర ఘట్టం. జీవితంలో ఒకసారి జరిగే ఆ వేడుకను బాగా ఆస్వాదించాలని అందరూ కోరుకుంటారు. అయితే ఓ వరుడు తన పెళ్లి వేడుకలో శ్రుతి మించి ప్రవర్తించాడు. పెళ్లి ఊరేగింపు సమయంలో కారు నుంచి దిగి 15 అడుగుల ఎత్తు ఉన్న వ్యాన్ మీదకు ఎక్కి చిందులు వేశాడు. దీంతో అందరూ షాకయ్యారు. బంధువులు, స్నేహితులు ఎంత పిలిచినా అతను కిందకు దిగి రాలేదు. 


మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌‌లో సోమవారం సాయంత్రం ఓ పెళ్లి ఊరేగింపు జరిగింది. మార్గమధ్యంలో వరుడు తన కారు నుంచి దిగి వెనుక ఉన్న డీజే వ్యాన్ ఎక్కాడు. పాటకు అనుగుణంగా చిందులేశాడు. దీంతో బంధువులు, స్నేహితులు షాకయ్యారు. ముందు కొద్దిసేపు వారు కూడా వరుడి డ్యాన్స్‌ను ఆస్వాదించారు. అయితే ఎంతకీ అతను ఆపకపోవడంతో వారు రంగంలోకి దిగారు. కిందకు దిగమని ప్రాథేయపడ్డారు. అయినా వరుడు వినలేదు. దాదాపు 45 నిమిషాలు పాటు డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు. చివరకు ఒక వ్యక్తి పైకి ఎక్కి వరుడిని బలవంతంగా కిందుకు దించాడు. ఈ దృశ్యాన్ని చుట్టుపక్కల వారు వీడియో తీశారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement