Abn logo
Sep 29 2020 @ 15:08PM

డీహెచ్‌ఎఫ్‌ఎల్ లో భారీ మోసాలను గుర్తించిన ఆడిటింగ్ సంస్థ

Kaakateeya

ముంబై : డీహెచ్‌ఎఫ్‌ఎల్ లో 2016-2019 సంవత్సరాల మధ్య భారీగా అవకతవకలు జరిగినట్లు వెల్లడైంది. దాదాపు రూ. పన్నెండు వేల కోట్ల మేరకు మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ఆడిటింగ్ సంస్థ గ్రాంట్ థోర్న్‌టన్ తనిఖీలో వెలుగుచూసింది. మురికివాడల్లో గృహ నిర్మాణ ప్రాజెక్టుల పేరుతో వీరు ఈ అక్రమాలకు పాల్పడ్డారని గ్రాంట్ థోర్న్‌టన్ వెల్లడించింది.


డీహెచ్‌ఎఫ్‌ఎల్(దీవాన్ హౌసింగ్ ఫ్రాన్స్ కార్పోరేషన్)లో 2016-17 నుండి 2018-19 ఈ మోసపూరిత లావాదేవీలు చోటు చేసుకున్నాయని ఆడిటింగ్ సంస్థ గుర్తించింది. ఈ నివేదిక ప్రకారం డీహెచ్ఎఫ్ఎల్ చేపట్టిన రెండు ప్రాజెక్టుల అభివృద్ధికి జారీ చేసిన రుణాల్లో ఈ అవకతవకలు జరిగాయి.


డీహెచ్ఎఫ్ఎల్ వ్యవహారంపై దర్యాఫ్తు నిర్వహించేందుకు ఈ ఏడాది ప్రారంభంలో గ్రాంట్ థోర్న్‌టన్ సహాయాన్ని దివాలా స్మృతి కింద నియమితులైన డీహెచ్ఎఫ్ఎల్ అడ్మినిస్ట్రేటర్ కోరింది.


డీహెచ్ఎఫ్ఎల్ దివాలా పరిష్కార ప్రక్రియకు గత ఏడాది ఎన్సీఎల్టీ అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సుబ్రమణియ కుమార్‌ను డీహెచ్ఎఫ్ఎల్ అడ్మినిస్ట్రేటర్‌గా ఎన్సీఎల్టీ నియమించింది.


కాగా... అడ్మినిస్ట్రేటర్‌కు ఆడిటర్లు ఇచ్చిన నివేదిక ప్రకారం మొత్తం రూ.12,705 కోట్ల విలువైన ఈ లావాదేవీల్లో దాదాపు రూ. 11 వేల కోట్లు అసలు కాగా, మిగిలిన మొత్తం వడ్డీల రూపంలో జరిగాయి. 


Advertisement
Advertisement
Advertisement