Advertisement
Advertisement
Abn logo
Advertisement

అక్రమ నిర్మాణాలను ప్రారంభ దశలోనే గుర్తించాలి

కామారెడ్డి, నవంబరు 24: అక్రమ నిర్మాణాలను ప్రారంభ దశలోనే గుర్తించాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో టాస్క్‌ఫోర్స్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల్లో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డి, బాన్సువాడ ఆర్‌డీవోలు శ్రీను, రాజాగౌడ్‌, పట్టణ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి శైలజ, కమిషనర్లు దేవేం దర్‌, రమేష్‌కుమార్‌, జగ్జీవన్‌ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో కొవిడ్‌ పునరావాస కార్యక్రమానికి మద్దతు
కొవిడ్‌ మహమ్మారి కారణంగా భర్తలు, కుటుంబాలను కోల్పోయిన మహిళలను ఆదుకోవడానికి నిర్మాణ్‌ ఆర్గనైజే షన్‌ భాగస్వామ్యంతో మొత్తం 50 మంది మహిళలకు పలు వస్తువులను అందించారు. తమ కుటుంబాలను పోషించుకోవడానికి కుట్టు యంత్రం, కిరాణ సామ గ్రి, రెడీమేడ్‌ వస్త్రాలు, పీకో మెషిన్‌ మొదలైన జీవనోపాధి కిట్‌ను కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, ఎస్పీ శ్వేతారెడ్డి, జిల్లా సంక్షేమాధికారి సరస్వతీ, నిర్మాణ ఆర్గనైజేషన్‌ వ్యవస్థాపక సీఈవో ఉమాకేసని తదితరులు అందించారు.

Advertisement
Advertisement