Abn logo
Aug 3 2021 @ 23:20PM

అడ్డుగా ఉన్నాడని అంతమొందించారు!

వివరాలు వెల్లడిస్తున్న సీఐ రాజేష్‌

మామ, కోడలి మధ్య వివాహేతర సంబంధం

ఏల్చూరు హత్య కేసులో ఇద్దరూ అరెస్టు

24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు 

వివరాలను వెల్లడించిన సీఐ రాజేష్‌

అద్దంకి, ఆగస్టు 3: కన్న తండ్రి, కట్టుకున్న భార్య అతని పాలిట కాలయములయ్యారు. ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధానికి అ డ్డుగా ఉన్నాడన్న కారణంతో అత్యంత దారుణంగా కడతేర్చారు. సంత మాగులూరు మండలం ఏల్చూరులో ఆదివారం రాత్రి జరిగిన సల్లూరి లక్ష్మయ్య (38) హత్య కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. మామాకోడళ్లను అరెస్టు చేశారు. వివరాలను అద్దంకి సీఐ రాజేష్‌ మం గళవారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. ఏల్చూరుకు చెందిన సల్లూరి కరుణయ్య, మరియమ్మకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. మరి యమ్మ 30 సంవత్సరాల క్రితం మృతి చెందింది. పెద్ద కుమారుడు లక్ష్మ య్యకు 18 సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లా వినుకొండకు కన్న తండ్రి, కట్టుకున్న భార్య అతని పాలిట కాలయములయ్యారు. ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధానికి అ డ్డుగా ఉన్నాడన్న కారణంతో అత్యంత దారుణంగా కడతేర్చారు. సంత మాగులూరు మండలం ఏల్చూరులో ఆదివారం రాత్రి  జరిగిన సల్లూరి లక్ష్మయ్య (38) హత్య కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. మామాకోడళ్లను అరెస్టు చేశారు. వివరాలను అద్దంకి సీఐ రాజేష్‌ మం గళవారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. ఏల్చూరుకు చెందిన సల్లూరి కరుణయ్య, మరియమ్మకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. మరి యమ్మ 30 సంవత్సరాల క్రితం మృతి చెందింది. పెద్ద కుమారుడు లక్ష్మ య్యకు 18 సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన సునీతతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.  పెళ్లైన కొద్దికాలం నుంచే సునీతకు మామ కరుణయ్యతో వివాహేతర సంబం ధం నడుస్తోంది. ఈనేపథ్యంలో సునీత తరచూ భర్త లక్ష్మయ్యతో గొడ వ పడుతోంది. ఈ విషయమై పలుమార్లు లక్ష్మయ్య, బంధువులు మా మాకోడళ్లను మందలించా రు. అయినప్పటికీ వారిలో మార్పు రాకపోగా విచ్చల వి డిగా తిరగసాగారు. ఈ నేప థ్యంలో ఆదివారం సాయం త్రం లక్ష్మయ్య మద్యం సేవిం చి వచ్చి భార్య, తండ్రితో గొడవపడ్డాడు. ఆతర్వాత బ యటకు వెళ్లాడు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న ల క్ష్మయ్యను అంతమొందించాలని మామా కోడళ్లు నిర్ణయించుకున్నారు. 

మరోసారి మద్యం తాగి ఇంటికి వచ్చిన లక్ష్మయ్యతో పథకం ప్రకారం ఇద్దరూ గొడవపెట్టుకున్నారు. ఈ సమయంలో లక్ష్మయ్య తలపై తండ్రి కరుణయ్య కర్రతో బలంగా కొట్టాడు. దీంతో  మంచంపై పడిపోయిన అతని రెండు కాళ్లను భార్య గట్టిగా పట్టుకోగా కరుణయ్య కొడుకు ము ఖంపై దుప్పటి వేసి కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. అనంతరం భర్త మార్మాంగాలపై సునీత కొడవలితో కోసింది. దీంతో లక్ష్మయ్య మృతి చెందాడు. అతని సోదరుడి ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. 24 గంటల్లోనే కేసును ఛేదించారు. కరుణయ్య, సునీతలను అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో సంతమాగులూరు ఏఎస్సై శివన్నారాయణ పాల్గొన్నారు.