Abn logo
Apr 2 2020 @ 12:23PM

13 ఏళ్ల క్రితం పెళ్లి.. ఇద్దరు కుమారులు.. కాపురంలో చిచ్చు పెట్టిన వివాహేతర సంబంధం

వివాహేతర సంబంధంతోనే భర్త హత్య

పాతనేరస్థుడిని హతమార్చిన కేసులో నిందితులకు రిమాండ్‌


నల్లగొండ (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ప్రియుడితో కలిసి నల్లగొండ పట్టణ పరిధిలో ఓ భార్య తన భర్తను హతమార్చింది. మార్చి 26వ తేదీన నల్లగొండలోని అద్దంకి బైపా్‌సలో ఉన్న ఓ పైపుల కంపెనీ వద్ద జరిగిన హత్యకేసులో నిందితులను పోలీసులు అరెస్టుచేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన మారం వెంకట్‌రెడ్డి 13ఏళ్ల క్రితం పానగల్‌కు చెందిన చాపల స్రవంతిని వివాహం చేసుకున్నాడు.


వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకట్‌రెడ్డి వివాహానికి ముందునుంచే జల్సాలకు అలవాటుపడి చోరీలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. వివాహ అనంతరం కూడా అదేవృత్తిని కొనసాగిచడంతో, వివిధ ప్రాంతాల్లో సుమా రుగా 40పైగా కేసులు నమోదయ్యాయి. స్రవంతి పానగల్‌కు చెందిన మున్నా శేఖర్‌ అనే వ్యక్తితో పాఠశాలలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ విషయం వెంకట్‌రెడ్డికి తెలియడం తో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో టూటౌన్‌ పోలీస్ స్టేషన్‌లో వెంకట్‌రెడ్డిపై స్రవంతి ఫిర్యాదు చేసి పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకున్నారు. అదే సమయంలో సాగర్‌రోడ్డులో ఎస్‌ఎల్‌బీసీలో ఉన్న ఓమద్యంషాపులో మద్యంచోరీ ఘటనలో వెంకట్‌రెడ్డి జైలుకు వెళ్లి, బెయిల్‌పై బయటకు వచ్చాడు. వెంకట్‌రెడ్డిని ఎలాగైనా అడ్డుతొలగించి స్రవంతిని పెళ్లి చేసుకోవాలని శేఖర్‌ పథకం వేశాడు. ఈ నెల 26న వెంకట్‌రెడ్డి ఓ డీసీఎంలో హైదరాబాద్‌ బయల్దేరాడు.


మర్రిగూడ స్టేజీ వద్ద శేఖర్‌తో పాటు అతడి స్నేహితులతో కలిసి కారులో డీసీఎంకు అడ్డుపెట్టి, వెంకట్‌రెడ్డిని కారులో ఎక్కించుకున్నారు. పైపుల కంపెనీ వద్ద నిర్మానుష్య ప్రదేశంలో శేఖర్‌ తనవెంట తీసుకొచ్చిన కత్తితో వెంకట్‌రెడ్డి గొంతు, వీపుపై పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సీసీ కెమెరాలు, కాల్‌డేటా ఆధారంగా పానగల్‌కు చెందిన మున్నా శేఖర్‌, మృతుడి భార్య చాపల స్రవంతి శ్రీరామ్‌నగర్‌ కాలనీకి చెందిన విశ్వనాథుల ఈశ్వర్‌ అలియాస్‌ చింటు, దుంపల సాయికుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో వన్‌టౌన్‌ సీఐలు బాషా, నిగిడాల సురేష్‌, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement