Abn logo
Feb 25 2021 @ 19:33PM

పెట్రో పెంపు విషయంపై ఇతర రాష్ట్రాల సీఎంలతో చర్చిస్తా : మమత

కోల్‌కతా : పెరిగిన పెట్రో ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎల్పీజీ సిలిండర్ ధర కూడా ఏకంగా 800 రూపాయలకు ఎగబాకిందని గుర్తు చేశారు. అంతేకాకుండా కిరోసిన్‌కు సబ్సిడీ కింద ఇచ్చే నాలుగు వేల కోట్లను కూడా బడ్జెట్‌ నుంచి తప్పించేశారని మండిపడ్డారు. ఇలా చేయడం ఏమీ బాగోలేదన్నారు. ఈ విషయంపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా చర్చిస్తానని ఆమె వెల్లడించారు. మోదీ స్టేడియానికి ఇరువైపులా అదానీ, అంబానీ ఉన్నారని, మేమిద్దరం, మావాళ్లిద్దరు అన్న ధోరణిలో వెళ్తున్నారని మమత మండిపడ్డారు. 

Advertisement
Advertisement
Advertisement