Abn logo
Mar 6 2021 @ 11:18AM

అద్దంలో నా శరీరాన్ని చూసుకుని బాధపడేదాన్ని: ఇలియానా

తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా వెలిగింది గోవా బ్యూటీ ఇలియానా. అలాంటి ఇలియానా ఒక దశలో తన శరీరం పట్ల అసంతృప్తిగా ఉండేదట. తను అందంగా లేనని, తన కొలతలు సరిగ్గా లేవని బాధపడేదట. అద్దంలో తన శరీరాన్ని చూసుకుని వేదనకు గురయ్యేదట. ఈ విషయాన్ని ఇలియానా తాజాగా వెల్లడించింది. `బాడీ డిస్‌మార్ఫియా` అనే ఫోబియా గురించి మాట్లాడింది. 

`కొంత మంది అమ్మాయిలు తమకు మంచి శరీర సౌష్టవం ఉన్నా, ఉండాల్సిన కొలతల్లోనే శరీర భాగాలున్నా వారెప్పుడూ తమ శరీరం గురించి అసంతృప్తికి గురవుతుంటారు. దానినే `బాడీ డిస్‌మార్ఫియా` అంటారు. ఎంత అందంగా ఉన్నప్పటికీ అద్దంలో చూసుకున్నప్పుడు వారికి తమలో ఏదో ఒక లోపం కనిపిస్తుంటుంది. దానిని కవర్ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. నిజానికి, జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించినపుడు, మనసు నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం అందంగా కనిపిస్తాం. ఆ విషయం చాలా మందికి తెలియడం లేదు. ఒకప్పుడు నేనూ ఈ సమస్యతో బాధపడ్డాను. అయితే ఇప్పుడు నా శరీరంలో పాజిటివ్ అంశాలను చూడడం నేర్చుకున్నా. నా శరీరం పట్ల గర్వంగా ఫీలవుతున్నాన`ని ఇలియానా చెప్పుకొచ్చింది.

Advertisement
Advertisement
Advertisement