Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఐఎఫ్‌సీఐ షేర్లు... రెండో రోజూ దూకుడే... వారంలో 39 శాతం జూమ్...

ముంబై : ఐఎఫ్‌సీఐ(ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషఫన్ ఆఫ్ ఇండియా) షేర్ల జోరు కొనసాగుతోంది. భారీ వాల్యూమ్‌ల నేపధ్యంలో కంపెనీ షేర్లు వరుసగా రెండో రోజు కూడా దూకుడును ప్రదర్శించాయి. ఈ రోజు(మంగళవారం) ఇంట్రాడే లో కంపెనీ షేర్లు తొమ్మిది శాతం ర్యాలీ చేసి, రూ. 16.29 కు చేరుకున్నాయి. అంతేకాకుండా... ఈ ఏడాది జూన్ 24 నాటి 52 వారాల గరిష్ట స్థాయి రూ.16.40 కు  అత్యంత దగ్గరగా ట్రేడవుతున్నాయి. కేంద్ర  ప్రభుత్వానికి... ఐఎఫ్‌సీఐ వ్యూహాత్మక ప్రాముఖ్యత అనేది రాణించినపక్షంలో... రేటింగ్ ఔట్‌లుక్ 'స్టేబుల్'కు మార్చబడుతుందని రేటింగ్ ఏజెన్సీ తాజాగా వెల్లడించింది. దీంతో గత వారంలో స్టాక్ 39 శాతం జూమ్ చేసింది.


ఇదే కాలంలో ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్ 0.40 శాతం పెరిగింది. ఐఎఫ్‌సీఐ  నవంబరు 30 న, రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్‌ఏ ప్రతికూల దృక్పథంతో కంపెనీ డెట్ ఇన్‌స్ట్రుమెంట్ దీర్ఘకాలిక రేటింగ్‌లను డౌన్‌గ్రేడ్ చేసినట్లుగా వినవస్తోంది. ‘ఐఎఫ్‌సీఐ కి సంబంధించిన లిక్విడిటీ పొజిషన్‌లో రాబోయే రోజుల్లో దాని రుణ చెల్లింపు బాధ్యతలు,  వ్యాపార పునరుద్ధరణ ప్రణాళికపై పెరుగుతున్న అప్‌డేట్‌లు లేకపోవడం తదితర కారణాలతో రేటింగ్‌లు డౌన్‌గ్రేడ్ కారకాలను తగ్గించాయి. ఇది భారత ప్రభుత్వం నుంచి కంపెనీ వ్యాపార కార్యకలాపాలపరంగా మూలధన ఇన్ఫ్యూషన్‌ను తిరిగి పొందాలని భావించింది’ అని ఐసీఆర్‌ఏ వెల్లడించింది. 

Advertisement
Advertisement