Abn logo
Sep 29 2020 @ 15:30PM

ఆర్జేడీ వస్తే మళ్లీ కిడ్నాప్‌లు, దోపిడీలు: ఫడ్నవీస్

Kaakateeya

పాట్నా: బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతివిమర్శలు మరింత పదునెక్కతున్నాయి. తాజాగా ఆర్జేడీపై బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఆర్జేడీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ కిడ్నాప్‌లు, దోపిడీలు పెరుగుతాయి’ అని వ్యాఖ్యనించారు. లాలూ అధికారంలో ఉన్న జంగిల్ రాజ్‌కు విముక్తి లభించిందని, మళ్లీ వారు (ఆర్జేడీ) అధికారంలోకి వస్తే పాత రోజులు వస్తాయని అన్నారు.


బిహార్‌లోని టౌన్‌హాల్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ ‘‘తేజస్వీ యాదవ్ 10 లక్షల మంది నేరస్తులకు ఉద్యోగాలు ఇచ్చారని విన్నాను. వారికి తుపాకులను కూడా కొనుగోలు చేశారట. రాష్ట్రంలో మళ్లీ కిడ్నాప్‌లు, దోపిడీలు ప్రారంభించడానికి ఆర్జేడీ ఈ కుట్రలు పన్నుతోంది’’ అన్నారు. దీనికి ముందు రోజు తేజస్వీ యాదవ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు ఫడ్నవీస్ పై విధంగా సమాధానం ఇచ్చారు.


‘‘రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, తాము అధికారంలోకి వస్తే మొదటి క్యాబినేట్ మీటింగ్‌లోనే 10 లక్షల ఉద్యోగాల భర్తీకి సంతకం చేస్తాము’’ అని తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement
Advertisement