Abn logo
Sep 27 2020 @ 13:39PM

తెలంగాణలో విగ్రహాల విధ్వంసం.. స్వామి చేతిలోని ఆయుధాలు అపహరణ

Kaakateeya

మేడ్చల్: ఏపీలోనే కాదు తెలంగాణలోనూ దేవతా విగ్రహాల విధ్వంసం జరుగుతోంది. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామ పరిధిలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. స్థానిక మల్లికార్జున స్వామి వారి ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. బంగారం వస్తువులతో పాటు హుండీలోని నగదును ఎత్తుకెళ్లడంతో పాటు స్వామి వారి చేతిలోని ఆయుధాలను అపహరించారు. ఆలయ పూజారుల సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురు దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి దారుణానికి ఒడిగట్టిన వారిని అరెస్ట్ చేయాలని భక్తులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement