Abn logo
Jul 11 2020 @ 06:09AM

ఇంటిపనివారిని కార్మికులుగా గుర్తించండి

గజపతినగరం, జూలై 10: ఇంటిపనివారిని కార్మికులుగా గుర్తించి ప్రభు త్వం వారికి ఆర్థిక భరోసా కల్పించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి కోరారు. ఈమేరకు  ఆమె ఇంటిపనివారితో కలిసి శుక్రవారం స్థానిక తహసీల్దార్‌ కార్యా లయం వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా నేప థ్యంలో ఇంటి యజమానులు వారిని పనులకు రానివ్వకుండా కట్టడి చేస్తున్నా రని, దీంతో వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారికి ఉపాధి పనులు కల్పించడంతో పాటు ఒంటరి మహిళలకు జగనన్న చేయూత పథకం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కరోనా సాయం కింద రూ.7,500 అందజేయాలని కోరారు. కార్యక్రమంలో బి.చిన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement