చిన్నారులతో ఉపాధ్యాయులు
పరిగి: మండల పరిధి హిర్యానాయక్ తండాలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, సీఆర్పీ చంద్రశేఖర్లు మంగళవారం ఇటుకబట్టీలో 24మంది బాలకార్మికులను గుర్తించారు. ఈ మేరకు పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారిని పాఠశాలలో చేర్పించారు. వీరంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారని తెలిపారు.