Advertisement
Advertisement
Abn logo
Advertisement

కవల అక్కాచెల్లెళ్లకు జత కలిసిన కవల అన్నాదమ్ములు... అందరివీ ఒకే తరహా ఉద్యోగాలు!

వాషింగ్టన్: ఎవరి ఇంట్లోనైనా కవలలు జన్మిస్తే వారి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. అలాగే వారి కుటుంబమంతా ఆనందడోలికల్లో మునిగితేలుతుంటుంది. అమెరికాలోని ఆరెగాన్‌లో ఉంటున్న కవల అక్కాచెల్లెళ్లు వెనెసా, కెరిసాలకు కవలసోదరులు భాగస్వాములుగా లభించారు. లుకాస్, జాకబ్ సీల్బీ అనే ఈ ఇద్దరు అన్నదమ్ములు ప్రస్తుతం వెరెసా, కెరిసాలతో డేట్ చేస్తున్నారు. ఈ నలుగురూ ప్రస్తుతం ఒకేదగ్గర ఉంటున్నారు.

వీరంతా 2020లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వెనెనా మాట్లాడుతూ తాము నలుగురం కలిసే ఉంటున్నాం. కవలలుగా పుట్టి కవలలతోనే ఉంటున్నందుకు ఆనందంగా ఉంది  అని అన్నారు. వీరు నలుగురూ వైద్యరంగంలోనే పనిచేస్తున్నారు. జాకబ్ మాట్లాడుతూ కొన్ని ఘటనలు మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. మా విషయంలో అదే జరిగింది. ఇది మాకు ఎంతో ఆశ్చర్యకరంగా ఉందన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement