Abn logo
May 20 2020 @ 04:37AM

ఆదర్శంగా మునిసిపాలిటీగా తీర్చిదిద్దాలి

కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా 


పెబ్బేరు, మే 19:  పెబ్బేరుని ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ యాస్మిన్‌బాషా అన్నారు. స్థానిక మునిసిపల్‌ కార్యాలయంలో  2020-21 బ డ్జెట్‌ సమావేశం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఎద్దుల కరుణశ్రీ అధ్యక్షతన మంగళ వారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. రూ.8.43 కోట్ల సాధారణ అంచనాతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టామన్నారు. 


ఇవికాక 14వ ఆ ర్థిక సంఘం, పట్టణప్రగతి నిధులు, ప్లాన్‌, నాన్‌ప్లాన్‌గ్రాంట్‌ కింద  రూ.24.25 కోట్ల అంచనా వేయగా అన్ని గ్రాంట్లు కలిపి రూ.32.74కోట్లతో  అంచనా త యారు చేశామని కలెక్టర్‌కు కరుణశ్రీ వివరించారు. ప్రభుత్వ సూచనల అ నుసారం రెండు కోట్లతో పాత నేషనల్‌ హైవే రోడ్డులో  మునిసిపిపాలిటి కేం ద్రంలో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు, రూ.30లక్షలతో అంబేడ్కర్‌ పార్కు ఏ ర్పాటుకు టెండర్లు పిలవడం అభినందనీయమన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తి చేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డు, మినీ స్టేడియంకు స్థల సేకరణ చేయాలని కలెక్టర్‌ మునిసిపల్‌ అధికారులను  ఆ దేశించారు.


100శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని ఎవరైనా ప్రభు త్వ స్థలాలను అక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.  కరోనా వై రస్‌తో ఇబ్బందులు తలెత్తాయని ఆదాయం, వ్యయంపైన  ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. కౌన్సిలందరూ పట్టణాభివృద్ధికి సహకరించాలని కలె క్టర్‌ కోరారు.  మునిసిపల్‌ కమిషనర్‌ కృష్ణయ్య, వైస్‌ చైర్మన్‌ కర్రె స్వామి,  కౌన్సిలర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement