Abn logo
Jun 4 2020 @ 02:18AM

కరోనాకు ఐబూప్రోఫెన్‌తో చికిత్సకు ట్రయల్స్‌

లండన్‌, జూన్‌ 3: ఆస్పత్రుల్లో చేరిన కరోనా రోగులకు చికిత్స అందించడానికి ఐబూప్రోఫెన్‌ మందు ఉపయోగపడుతుందా? అన్న విషయాన్ని తేల్చడానికి లండన్‌ శాస్త్రవేత్తలు ట్రయల్స్‌ ప్రారంభించారు. శరీరంపై వాపులు, నొప్పులను తగ్గించే ఐబూప్రోఫెన్‌ శ్వాసకోశ సమస్యలను కూడా తగ్గిస్తుందని ‘గయ్స్‌, సెయింట్‌ థామస్‌ ఆస్పత్రి-కింగ్స్‌ కాలేజ్‌’ శాస్త్రవేత్తల బృందం భావిస్తోంది. ఈ మందుతో తక్కువ ఖర్చుతో చికిత్స అందించడంతో పాటు కరోనా రోగులను వెంటిలేటర్లపై ఉంచే అవసరం కూడా రాకుండా చూసుకోవచ్చని వారు ఆశిస్తున్నారు. 


Advertisement
Advertisement
Advertisement