Abn logo
Sep 24 2021 @ 00:17AM

నన్ను మోసం చేశారు

నిరసన దీక్ష చేస్తున్న కె.నాగలాపురం వైసీపీ ఎంపీటీసీ రాజమ్మ, ఆమె కుమారుడు వైసీపీ నాయకుడు నరసింహారెడ్డి, కార్యకర్తలు

  1. వైసీపీ నాయకులపై అదేపార్టీ ఎంపీటీసీ ఆగ్రహం
  2. న్యాయం చేయాలని నాగులాపురంలో దీక్ష 


గూడూరు, సెప్టెంబరు 23: గూడూరు మండలం వైసీపీలో విభేదాలు రోడ్డెక్కాయి. ఎంపీపీ పదవి ఇస్తామని వైసీపీ నాయకులు మోసం చేశారని ఆ పార్టీకి చెందిన కె.నాగులాపురం ఎంపీటీసీ రాజమ్మ, ఆమె కుమారుడు, వైసీపీ నాయకుడు నరసింహారెడ్డి ఆరోపించారు. గూడూరు ఎంపీపీ పదవి అన్‌ రిజర్వుడు మహిళ రిజర్వు అయింది. మండలంలో ఏడు ఎంపీటీసీలు వైసీపీ 5 స్థానాలను గెలుచుకుంది. అయితే ఎంపీపీ పదవి చనుగొండ్ల-1 ఎంపీటీసీ సునీతకు ఇచ్చేందుకు వైసీపీ నాయకులు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఎంపీటీసీ రాజమ్మ, ఆమె కుమారుడు నరసింహారెడ్డి, కుటుంబ సభ్యులు, కార్యకర్తలతో కలిసి గురువారం కె.నాగులాపురంలోని వైఎస్‌ విగ్రహం ముందు నిరసనకు దిగారు. ఎంపీపీ పదవి ఇస్తామని చెప్పి వైసీపీ నాయకులు మోసం చేశారని వారు ఆరోపించారు. ఎమ్మెల్యే సుధాకర్‌, కర్నూలు మేయర్‌ బీవై రామ య్య వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. తమకు న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదని వారు భీష్మించారు.