మాట్లాడుతున్న దామచర్ల జనార్దన్, డేవిడ్రాజు
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల
ఒంగోలు (కార్పొరేషన్), జనవరి 17 : మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్రాజు తిరిగి టీడీపీలో చేరే విషయమై అధినేత చంద్రబా బునాయుడుతో మాట్లాడతానని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ తెలిపారు. ఇటీవల వివాహమైన డేవిడ్రాజు కుమారుడు దంపతులకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఆది వారం మధ్యాహ్నం ఒంగోలులోని వారి గృహా నికి దామచర్ల వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ డేవిడ్రాజు తిరిగి టీడీపీలోకి వ చ్చే ఆలోచనలో ఉన్నారనే సమాచారం రాష్ట్ర నాయక త్వానికి కూడా తెలుసన్నారు. తాను కూడా అవకాశం చూసుకొని చంద్రబాబును కలిసి డేవిడ్రాజును పార్టీలో చేర్చుకోవాలని కోరతానని తెలిపారు. అనంతరం డేవిడ్ రాజు మాట్లాడుతూ గతంలో టీడీపీలో తనకు సముచిత స్థానం కల్పించారని, అయితే కొన్ని కారణాల వల్ల పార్టీ ని వీడటం బాధ కలిగించిందన్నారు. తిరిగి తనతోపాటు, తన కుమారుడు, కోడలు కూడా పార్టీలో చేరేందుకు సి ద్ధంగా ఉన్నామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు లో దామచర్ల జనార్దన్ గెలుపు కోసం కష్టపడి పనిచే స్తామని చెప్పారు. సమావేశంలో మునిసిపల్ మాజీ చై ర్మన్ మంత్రి శ్రీనివాసరావు, వైవీ.సుబ్బారావు, డాక్టర్ గు ర్రాల రాజ్విమల్, దర్శి కోఆర్డినేటర్ పమిడి రమేష్ తది తరులు పాల్గొన్నారు.