Abn logo
May 12 2020 @ 10:19AM

ప్రపంచ హెవీవెయిట్ మాజీ ఛాంపియన్ మైక్ టైసన్ సంచలన ప్రకటన

నేను బాక్సింగ్ రింగ్‌లోకి తిరిగి వస్తున్నా...

న్యూఢిల్లీ : ప్రపంచ హెవీ వెయిట్ మాజీ ఛాంపియన్ మైక్ టైసన్ బాక్సింగ్ రింగ్‌లోకి పునరాగమనం గురించి సంచలన ప్రకటన చేశారు. బాక్సింగ్ లో శిక్షణ పొందుతున్న తన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసి ‘‘నేను తిరిగి బాక్సింగ్ రింగ్‌లోకి వస్తున్నా’’ అంటూ మైక్ టైసన్ మెసేజ్ పెట్టారు. 53 ఏళ్ల వయసుగల మైక్ టైసన్ వర్కవుట్ చేస్తూ చిత్రీకరించిన షార్ట్ వీడియోను పెట్టడంతో బాక్సింగ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. వేగం, పంచ్ పవరుతో హెవీ వెయిట్ గా నిలిచి పలు టైటిళ్లు సాధించిన టైసన్ మళ్లీ బాక్సింగ్ రింగ్ లోకి దిగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఓ స్వచ్ఛందసంస్థకు విరాళాల సేకరణ కోసమే మైక్ టైసన్ బాక్సింగ్ రింగ్ లోకి దిగుతున్నారని సమాచారం. మైక్ టైసన్ రిటైర్ మెంటుకు ముందు పాల్గొన్న 58 బాక్సింగ్ పోటీల్లో 50 విజయాలు సాధించారు. 

Advertisement
Advertisement
Advertisement