Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 10 2021 @ 11:54AM

పురాతన నాణెం పేరుతో మోసం

 హైదరాబాద్‌ యువకులకు వల

పోలీసులకు అప్పగించిన విజయనగరం జిల్లా ఎస్‌.కోట యువత


హైదరాబాద్/శృంగవరపుకోట: పురాతన నాణేనికి మహిమలు ఉన్నాయంటూ మోసం చేసేందుకు యత్నించిన ఇద్దరు పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖ జిల్లా అరుకు మండలం సుంకరమెట్టకు చెందిన ఇద్దరు గిరిజన యువకులు తమ వద్ద పురాతన ఈస్ట్‌ఇండియా కాలం నాటి నాణెం ఉందంటూ హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువకులకు కొద్దిరోజుల కిందట ఫోన్‌లో సంప్రదించారు. రూ.ఐదు లక్షలు ఇస్తే నాణెం ఇస్తామన్నారు. ఈనెల 9న (మంగళవారం) నాణెం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు గిరిజన యువకులు శృంగవరపుకోటలోని శివరామరాజుపేట రోడ్డు వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ముగ్గురు యువకులు కూడా కారులో శృంగవరపుకోట వచ్చారు. శివరామరాజుపేట ప్రాంతంలోని బంగారమ్మగుడి వద్ద ఇరువర్గాల వారు కలుసుకున్నారు. కొద్దిసేపు మాట్లాడుకున్నాక గిరిజన యువకులు తమ వద్ద నాణెం ఉందని.. డబ్బు తెచ్చారా అని అడిగారు. హైదరాబాద్‌ యువకులు తమ వద్దనున్న రూ.ఐదు లక్షల నగదును చూపించారు. రెప్పపాటులో గిరిజన యు వకులు ఆ డబ్బులు లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. హైదరాబాద్‌ యువకులు వారిని వెంబడించారు. ఇదంతా గమనించిన శృంగవరపుకోట పెద్దవీధి యువకులు ఏదో జరిగిందన్న అనుమానంతో వారిని వెంబడించి ఒక గిరిజన యువకుడిని  పట్టుకున్నారు. జరిగిన ఘటన తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీస్‌ సిబ్బంది వచ్చి నగదు, పురాతన నాణెం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement