Abn logo
Jan 18 2021 @ 05:10AM

హైదరాబాద్‌ టు ముంబై... 30 రోజుల తర్వాత!

‘రాధే శ్యామ్‌’ తాజా షెడ్యూల్‌ పూర్తయిందని కథానాయిక పూజా హెగ్డే వెల్లడించారు. దాంతో ఆదివారం హైదరాబాద్‌ నుంచి ముంబైలోని సొంతింటికి వెళ్లారామె. బయలుదేరడానికి ముందు షూటింగ్‌ స్పాట్‌లో కేక్‌ కట్‌ చేశారు. ఎందుకంటే... గత 30 రోజుల నుంచి ఈ సినిమా చిత్రీకరణ నిమిత్తం భాగ్య నగరంలోనే ఉన్నారు పూజ. అందుకని, 30 రోజుల భారీ షెడ్యూల్‌ పూర్తయిన మరుక్షణమే హైదరాబాద్‌ నుంచి ముంబైలోని ఇంటికి ప్రయాణం అయ్యానని ఆమె పేర్కొన్నారు. ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రమిది. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement