Abn logo
Oct 21 2021 @ 00:06AM

హెదరాబాద్‌ టూ కోయంబత్తూర్‌

కోయంబత్తూర్‌కు చెట్టును తీసుకెళ్తున్న లారీ

రూ.40 వేలు ఖర్చు చేసి 934 కిలోమీటర్ల దూరానికి చెట్టు తరలింపు


ములకలచెరువు, అక్టోబర్‌ 20: హైదరాబాద్‌ నుంచి తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌కు ఓ చెట్టును లారీలో తరలించారు. రూ.40వేలు ఖర్చు చేసి 934 కిలోమీటర్ల దూరానికి చెట్టును తీసుకెళ్తున్నారు. రెండు రోజుల క్రితం దేవగన్నేరు చెట్టును వేసుకుని హైదరాబాద్‌ నుంచి కోయంబత్తూర్‌కు  ఓ లారీ బయలు దేరింది. ఈ లారీ బుధవారం ములకలచెరువు మీదుగా వెళ్లడంతో పలువురు ఆసక్తిగా తిలకించారు. చెట్టును ఎక్కడి తీసుకెళ్తున్నారబ్బా అంటూ చర్చించుకున్నారు. దీనిపై లారీ డ్రైవర్‌ను ఆరా తీయగా...   ఓ సినిమా షూటింగ్‌కు సంబంధించి సన్నివేశాలు చిత్రీకరించేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపాడు. ఏ సినిమాకు అని ప్రశ్నించగా తెలియదని సమాధానం ఇచ్చాడు.