Advertisement
Advertisement
Abn logo
Advertisement

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం..మహిళ మృతి

హైదరాబాద్: నగరంలోని నారాయణగూడ పోలిస్‌స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బైక్‌‌పై వెళ్తున్న మహిళను వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. తలపై నుంచి ట్యాంకర్ వెళ్ళడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు కంచన్ భాగ్‌కు చెందిన నిధా రెహమాన్(26)గా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
Advertisement