Abn logo
Oct 4 2021 @ 09:24AM

హైదరాబాద్‌లో నెల్లూరు యువకుడు అదృశ్యం

హైదరాబాద్: నగరంలో నెల్లూరుకు చెందిన యువకుడి అదృశ్యం కలకలం రేపుతోంది.  నెల్లూరు జిల్లా ఏఎస్ పేటకి చెందిన షేక్ లాహీక్ షరీఫ్ అనే యువకుడు హైదరాబాద్‌లో కనిపించకుండాపోయాడు. హైదరాబాద్‌లోని అంజన హోమ్ సర్వీస్ టేక్ కేర్ అనే కంపెనీలో షరీఫ్ రెండు నెలలుగా ఉద్యోగం చేస్తున్నాడు. కాగా... జీతం డబ్బులు ఇవ్వకపోవడంతో కంపెనీ యాజమాన్యంపై షరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి షరీఫ్ అదృశ్యమయ్యాడు. తన తమ్ముడు కనిపించడం లేదని జగద్‌గిరిగుట్ట పోలీసు స్టేషన్‌లో సోదరుడు కలాం ఫిర్యాదు చేశాడు. 

ఇవి కూడా చదవండిImage Caption

హైదరాబాద్మరిన్ని...