Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర ముఠా అరెస్ట్..

హైదరాబాద్: ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. నిందితులకు 39 కేసుల్లో ప్రమేయం ఉందన్నారు. కరుడుగట్టిన నిందితుడు సయ్యద్ మోసిన్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అతని నుంచి 73 తులాల బంగారం, 4 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నామన్నారు. శంకర్ చౌహన్ అనే మరో నిందితుడిని అరెస్ట్ చేశామని, అతనిపై 11 కేసులు ఉన్నాయన్నారు. అతని వద్ద నుంచి 12 తులాల బంగారం, మూడున్నర కిలోల వెండీ స్వాధీనం చేసుకున్నామన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని అరెస్ట్ చేశామని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

Advertisement
Advertisement