Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్లకు నేటితో ముగియనున్న గడువు

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్లకు మంగళవారంతో గడువు ముగియనుంది. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. శంబిపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి, డాక్టర్ యాదవ రెడ్డి నిన్న నామినేషన్లు వేశారు. మంగళవారం కవిత, కసిరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, తాత మధు, దండే విఠల్ ఇతర జిల్లాల అధ్యక్షులు నామినేషన్లు వేయనున్నారు. ఏడు స్థానాల్లో సిట్టింగ్‌లకే అవకాశం ఇచ్చారు. ఐదు స్థానాల్లో సిట్టింగ్‌లకు హ్యాండ్ ఇచ్చారు. కొత్త వారికి అవకాశం కల్పించారు. కాగా పోటీపై కాంగ్రెస్ తర్జన భర్జనపడుతోంది. మెదక్, ఖమ్మంలో పోటీపై కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. మెదక్ అభ్యర్థిగా జగ్గారెడ్డి భార్య నిర్మల, ఖమ్మం అభ్యర్థిగా రాయల నాగేశ్వరరావును ఖరారు చేసింది.

Advertisement
Advertisement