Advertisement
Advertisement
Abn logo
Advertisement

జీహెచ్‌ఎంసీ ఉద్యోగులపై..మద్యం దుకాణం సిబ్బంది దాడి

హైదరాబాద్/పేట్‌బషీరాబాద్‌: ట్రేడ్‌ లైసెన్స్‌ బకాయిలు చెల్లించాలని వెళ్లిన అధికారులపై మద్యం షాపు నిర్వాహకులు దాడి చేసి గాయపరిచిన సంఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. కొంపల్లి మున్సిపల్‌ ఇన్‌చార్జి మేనేజర్‌ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం... కొంపల్లి మున్సిపాల్టీ పరిధి పోచమ్మగడ్డలోని మంజు మద్యం దుకాణానికి ఇన్‌చార్జి మేనేజర్‌ రమేష్‌, బిల్‌ కలెక్టర్‌ మహేష్‌ వెళ్లారు. వైన్‌షాపు కౌంటర్‌పై కూర్చొని ఉన్న షాపు నిర్వాహకుడు దేవేందర్‌రెడ్డిని బకాయి ఉన్న ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజును చెల్లించాలని అడిగారు. మద్యం మత్తులో ఉన్న నిర్వాహకుడు ‘మా వద్దకే వచ్చి బకాయి కట్టమంటారా’ అంటూ బిల్‌ కలెక్టర్‌ను దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు.

అక్కడ నుంచి పరుగులు తీసిన మహే్‌షను అదేషాపులో ఉండే మరో ముగ్గురు వెంటాడి మరీ దాడి చేశారు. రమే్‌షను సైతం దుర్భాషలాడి దాడికి పాల్పడ్డారు. దీంతో మున్సిపల్‌ అధికారులు పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సీఐ రమే్‌షను సంప్రదించగా, అధికారులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించామని దాడికి పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement