Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 10 2021 @ 07:18AM

Hyderabad: పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌: ప్రయాణికుల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని వివిధ ప్రాంతాల నుంచి ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా నవంబర్‌ 17, 24 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వీక్లీ స్పెషల్‌ రైలు (08586)నడుపుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే నవంబర్‌ 16, 23 తేదీల్లో విశాఖపట్నం- సికింద్రాబాద్‌ మధ్యన ప్రత్యేక  రైలు( 08585), నవంబర్‌ 18న నాందేడ్‌-బీదర్‌ మధ్యన ప్రత్యేక రైలు(07506) నవంబర్‌ 20న బీదర్‌ నుంచి నాందేడ్‌కు ప్రత్యేక రైలు(07507) నడుస్తుందని అధికారులు తెలిపారు. ఛత్‌పూజా ఉత్సవాలను పురస్కరించుకుని నవంబర్‌ 14న ధనపూర్‌-నుంచి ఎర్నాకుళం వరకు ప్రత్యేక రైలు (06044)ను నడుపుతున్నట్టు పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement