Advertisement
Advertisement
Abn logo
Advertisement

మరియమ్మ లాకప్‌డెత్‌పై నేడు Highcourtలో విచారణ

హైదరాబాద్: అడ్డగూడూరులో మరియమ్మ లాకప్‌డెత్‌పై నేడు హైకోర్టులో మరోసారి విచారణ జరుగనుంది. మరియమ్మ మృతిపై ఇప్పటికే  మెజిస్ట్రేట్ విచారణ నివేదికను హైకోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే. మరియమ్మ లాకప్‌డెత్ సీబీఐకి అప్పగించే అంశంపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకోనుంది.   సీబీఐ ఎస్పీ నేడు విచారణకు హాజరుకానున్నారు. కేసు పూర్తి వివరాలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌కు అప్పగించాలని గత విచారణలో ఏజీకి హైకోర్టు ఆదేశించింది. గత విచారణలో  సీబీఐ వంటి స్వతంత్ర సంస్థల దర్యాప్తు అవసరమని ధర్మాసనం తెలిపింది. సీబీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.


Advertisement
Advertisement