Advertisement
Advertisement
Abn logo
Advertisement

భార్య మాట వినడం లేదని కత్తితో దాడి.. తానూ పొడుచుకున్న భర్త

హైదరాబాద్/బంజారాహిల్స్‌: భార్యాభర్తల మధ్య విభేదాలు చంపుకునే వరకూ దారితీశాయి. భార్య తన మాట వినడం లేదని ఆగ్రహంతో ఆమెపై కత్తితో దాడి చేసిన భర్త అనంతరం తానూ పొడుచుకున్నాడు. బంజారాహిల్స్‌ పోలీలు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్‌కు చెందిన మానయ్య, సత్తమ్మ భార్యాభర్తలు. భర్త మద్యానికి బానిసవ్వడంతో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. భర్త పోరు పడలేక రెండు నెలల క్రిత్తం సత్తమ్మ బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12 మిధులానగర్‌లో ఉంటున్న తన బంధువు ఇంటికి వచ్చి, ఉంటోంది. ఈ నెల 22న మానయ్య భార్య వద్దకు వచ్చాడు. అతని రాక తెలుసుకున్న సత్తమ్మ కనిపించకుండా బయటకు వెళ్లింది.


ఆ రాత్రంతా భార్య కోసం అక్కడే ఉండి, స్వగ్రామానికి వెళుతున్నట్టు భార్యబంధువుకు చెప్పి వెళ్లిపోయాడు. ఈనెల 23న సత్తమ్మ తిరిగి బంధువు ఇంటికి వచ్చింది. కొద్దిసేపటికి మానయ్య కూడా వచ్చాడు. ఇద్దరూ గొడవ పడ్డారు. ఇంతలో మానయ్య తెచ్చుకున్న కత్తితో భార్యపై దాడి చేశాడు. అక్కడే ఉన్న ఇరుగూపొరుగు అడ్డుకున్నారు. మానయ్య ఆగకుండా అదే కత్తితో తన కడుపులో పొడుచుకుని కుప్పకూలిపోయాడు. బంధువు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు భార్యాభర్తలను చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement