'శ్యామ్ సింగ రాయ్' హిందీ రీమేక్ ..?

యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. ఈ సినిమాను ఇప్పుడు హిందీ రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు లేటెస్ట్ న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇందులో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ నెల 24న 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కలకత్తా నేపథ్యంలో భారీ బడ్జెట్ కేటాయించి వెంకట్ బోయనపల్లి నిర్మించారు. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. ఇప్పటికే సాంగ్స్, టీజర్స్‌తో అంచనాలు బాగా పెరిగాయి.ప్రస్తుతం ప్రమోషన్స్ నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే, హిందీలో 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను రీమేక్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో ఈ రీమేక్‌తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయని తెలుస్తోంది.

Advertisement
Advertisement