Abn logo
Oct 8 2021 @ 16:17PM

ముగిసిన హుజురాబాద్ నామినేషన్ల పర్వం

హుజురాబాద్‌: హుజురాబాద్‌ ఉప ఎన్నికకు నామినేషన్లు గడువు ముగిసింది. చివరిరోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్తి ఈటల రాజేందర్, టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్లు వేశారు. ఇప్పటివరకు 26 నామినేషన్లు దాఖలయ్యాయి. రిటర్నింగ్ కార్యాలయంలో మరికొందరు అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు ఉన్నారు. ఈనెల 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు విధించారు. ఈనెల 30న పోలింగ్, నవంబరు 2న ఓట్లను లెక్కిస్తారు.


బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరపున నామినేషన్ వేసేందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేత బండి సంజయ్ వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట నర్సింగరావు తరపున నామినేషన్ వేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వచ్చారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల పోటాపోటీ నినాదాలు చేశారు. నామినేషన్ కేంద్రం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

తెలంగాణ మరిన్ని...

క్రైమ్ మరిన్ని...