Abn logo
May 24 2021 @ 13:02PM

భార్యను బండరాయితో మోది హత్య చేసి...

హైదరాబాద్/తిరుమలగిరి : భార్యను బండరాయితో మోది హత్య చేసి భర్త ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుమలగిరి ఇన్‌స్పెక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... న్యూ గాంధీనగర్‌కు చెందిన అల్బర్ట్‌ (41), రేఖ (39) భార్యాభర్తలు. కూలీపనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అల్బర్ట్‌ పెయింటింగ్‌ పని చేస్తూ వచ్చిన డబ్బుతో మద్యం తాగేవాడు. దీనిపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. శనివారం రాత్రి కూడా మద్యం విషయంలో ఇద్దరూ గొడవ పడ్డారు. మద్యం మత్తులో ఆల్బర్ట్‌ బండరాయితో రేఖ తలపై మోదాడు. రేఖ అక్కడికక్కడే మరణించింది. రక్తం మడుగులో ఉన్న రేఖను చూసి భయపడి ఆల్బర్ట్‌ చీరతో ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గతంలో వీరి కుమారుడు  కూడా చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.