Advertisement
Advertisement
Abn logo
Advertisement

హుజూరాబాద్ మహిళ కడపలో దీక్ష..

  • భర్త ఇంటి ఎదుట భార్య దీక్ష

కడప/హుజూరాబాద్‌, నవంబరు 27: తనను ప్రేమించి పెళ్లి చేసుకుని కాపురానికి తీసుకెళ్లడం లేదంటూ భర్త ఇంటి ఎదుట భార్య బైఠాయించి చేపడుతున్న దీక్ష శనివారంకు రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సుహాసిని విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలోని కేడీసీసీ బ్యాంకు సమీపంలో సుజిత్‌ అనే వ్యక్తి కడప జిల్లాకు చెందిన తనను ప్రేమించి హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నాడని సుహాసిని తెలిపింది.


ఆరు నెలలుగా తనను భర్త నరహరి సుజిత్‌ కాపురానికి తీసుకెళ్లడం లేదని తెలిపింది. పలుమార్లు ఫోన్‌ చేసినా పట్టించుకోకపోవడంతో హుజూరాబాద్‌కు వచ్చానన్నారు. ఇంటి వద్దకు రాగానే తనను సుజిత్‌, అతడి తల్లి దూషిస్తూ కొట్టారని తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడే కూర్చుంటానని ఆమె అన్నారు. కాగా సహాసిని ఇంటి ఎదుట కూర్చున్న విషయం తెలుసుకున్న పట్టణంలోని పలువురు ఆమె వద్దకు వెళ్లి మద్దతు తెలుపుతున్నారు.

Advertisement
Advertisement