Abn logo
Oct 24 2021 @ 15:16PM

ఏ పనీ లేకుండా ఇంట్లో ఖాళీగా ఉన్న భర్త.. భార్య ఆ ఒక్కమాట అనడంతో అతడిలో కోసం కట్టలు తెంచుకుంది.. ఆ తర్వాత

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు 30ఏళ్ల వయసు. స్కూల్‌కు వెళ్లే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త కొన్ని రోజులుగా ఖాళీగా ఉంటుడంతో ఇల్లు గడవటం కష్టమైంది. ఈ క్రమంలో అతడి వద్ద ఆమె ఓ మాట అంది. అంతే.. ఆ మాటలు విన్న వెంటనే అతడు అగ్గిలం మీద గుగ్గిలం అయ్యాడు. భార్యను ఇష్టమొచ్చినట్లు తిట్టడమే కాకుండా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే.. 


అహ్మదాబాద్‌లోని పతేవాడికి చెందిన 30 ఏళ్ల మహిళకు కొద్ది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. భర్త ఆటో నడుపుతూ సంపాదించిన డబ్బుతో ఇంతకాలం ఆమె కుటుంబాన్ని నడిపింది. అయితే కొద్ది రోజులుగా ఆమె భర్త పనికి వెళ్లకపోవడంతో ఇల్లు గడవటం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె.. పిల్లల స్కూల్ ఫీజు కోసం భర్తను డబ్బు అడిగింది. అతడు డబ్బు లేదనడంతో.. ‘ఇంట్లో ఖాళీగా కూర్చునే కంటే.. ఏదైనా పని చూసుకోవచ్చు’ కదా అంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది. దీంతో అతడు ఆగ్రహానికి లోనయ్యాడు. అంతేకాకుండా ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పి, ఇంట్లోంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఇంటికి వచ్చిన అతడు.. ఆమెను ఇష్టమొచ్చినట్టు తిట్టడమే కాకుండా చేయి చేసుకున్నాడు. ఈ క్రమంలో స్థానికులు వచ్చి, ఆమెను రక్షించారు. అనంతరం ఆమె తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏదైనా పని చూసుకోమన్నందుకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ జరుపుతున్నారు. 



ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...

క్రైమ్ మరిన్ని...