Abn logo
Nov 25 2020 @ 12:42PM

మధుమేహం ఉంది... బరువు పెరగాలంటే?

ఆంధ్రజ్యోతి(25-11-2020)

ప్రశ్న: నా ఎత్తు ఐదడుగుల ఆరంగుళాలు, బరువు 54 కేజీలు. వయసు 47. మధుమేహం ఉంది.  మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటూనే బరువు పెరగవచ్చా?


- రమేష్‌ కోదాడ 


డాక్టర్ సమాధనం: మీ ఎత్తు, వయసును బట్టి మీరు అరవై కేజీల బరువు ఉంటే మంచిది. మధుమేహం ఉన్నవారు ముందుగా రక్తంలోని గ్లూకోజు నియంత్రించడంపై దృష్టి పెట్టాలి. వైద్యుల సలహాతో వాడే మందుల్లో మార్పు చేర్పుల ద్వారా, మరింత ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోవడం ద్వారా గ్లూకోజును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. గ్లూకోజు అదుపులోకి వచ్చిన తరువాత బరువు పెరిగేందుకు ప్రయత్నిస్తే మంచిది. మధుమేహం ఉన్నవారు బరువు పెరగడానికి ఆహారంలో మాంస కృత్తులు, మంచి కొవ్వు పదార్థాలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పెరుగు, పనీర్‌, సోయా ఉత్పత్తులు, పప్పు ధాన్యాలు, గింజలు మొదలైనవి ప్రతిపూటా తగుపాళ్లలో తీసుకోండి. మంచి కొవ్వుల కోసం బాదం, ఆక్రోట్‌, వేరుశెనగ, అవిసె, గుమ్మడి గింజలు మొదలైనవి ఆహారంలో భాగం చేసుకోవాలి. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ముడిధాన్యాలనూ తీసుకోవాలి. రోజూ సరైన వ్యాయామం ఉంటేనే మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటూ బరువు పెరగడం సాధ్యమవుతుంది. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను 

[email protected]కు పంపవచ్చు)

Advertisement
Advertisement
Advertisement