Advertisement
Advertisement
Abn logo
Advertisement

కార్ల వినియోగం 2050 నాటికి ఎలా ఉంటుందంటే ?

న్యూఢిల్లీ : రానున్న ముప్ఫై ఏళ్ళలో... అంటే 2050 నాటికి ఉత్తర అమెరికా, యూరోప్‌ దేశాల్లో కార్ల వినియోగం తగ్గుతుందన్న అంచానాఅున్నాయి. అయితే ఆసియా ఖండంలో మాత్రం ప్రయాణాలకు అత్యంత అనువుగా, సాధారణంగా వినియోగించే వాహనంగా ‘కారు’ మారుతుందని చెబుతున్నారు. వచ్చే మూడు దశాబ్దాల్లో ఆసియా దేశాల్లో... ప్రయాణాలకు కార్ల వినియోగం 40 శాతం కన్నా ఎక్కువ పెరుగుతుందని అంచనా. కాగా... ఐదేళ్ళ క్రితమే... కార్ల వినియోగం 28 శాతం మేర పెరగడం గమనార్హం.


ఇక... 2050 నాటికి ఆసియాలో కారు ప్రయాణాలకు సంబంధించి... యూరప్‌ వాటా 44 శాతం, లాటిన్‌ అమెరికా వాటా 42 శాతానికి చేరుకుటాయని, ఇక...  కొంతమేర తగ్గినప్పటికీ... ఉత్తర అమెరికాలో మాత్రం అత్యధికంగా 76 శాతంగా ఉంటుందని అంచనా. కాగా... 21వ శతాబ్దపు నగరాల్లో ఆసియా పసిఫిక్‌ ప్రాంతం ‘పట్టణ పరివర్తన’గా మారుతుందని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్వతంత్ర మీడియా ‘ఎంఐటీ టెక్నాలజీ రివ్యూ’ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యంత అధునాతన ప్రజారవాణా వ్యవస్థలకు నిలయంగా ఆసియా ప్రాంతం మారుతుందని, అయితే వివిధ దేశాల అభివృద్ధి స్థితిగతులు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధిలో భారీ వ్యత్యాసాల నేపధ్యంలో... ఆసియా ఖండం అభివృద్ధి చెందుతున్న దశలో... వాహనాల వినియోగం భారీగా పెరుగుతుందని ఎంఐటి టెక్నాలజీ రివ్యూ నివేదిక పేర్కొంది. 


సుస్థిరమైన విధానాలను సుదీర్ఘకాలంపాటు అమలు చేయడం ద్వారా, 2050 నాటికి ఆసియాలో కారు ప్రయాణాల వాటా 16-19 శాతానికి పరిమితం కావచ్చని నివేదిక నిర్థారించింది. ఆఫ్రికా, యూరోప్‌, లాటిన్‌ అమెరికా దేశాల్లో కారు ప్రయాణాలను సమానంగా తగ్గించడం సాధ్యమవుతుందని అధ్యయనకర్తలు, కార్ల తయారీ సంస్థలు కూడా భావిస్తున్నాయి. ఉత్తర అమెరికా, మధ్యప్రాచ్యంలో కార్ల వినియోగాన్ని తక్కువస్థాయికి తగ్గించడం కూడా కష్టతరంగా మారుతుందని నివేదికలో పేర్కొనడం విశేషం. 

Advertisement
Advertisement