Apr 15 2021 @ 10:05AM

శంకర్ ఈ సినిమాని ఎలా ప్లాన్ చేస్తున్నాడో..?

క్రియేటివ్ జీనియస్ శంకర్ ఎప్పుడు ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేస్తూ వస్తుంటాడు. ఒక్కో సినిమాకి రెండు మూడేళ్ళు సమయం తీసుకుంటాడు. అవసరమైతే మరో సంవత్సరం కూడా కావాలి. శంకర్ ప్రతీ సినిమాని హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తాడు కాబట్టి మొదలయ్యే డేట్ పక్కాగా తెలిసినా.. ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడం మాత్రం కష్టమే. ఇక శంకర్ సినిమా అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. సామాజిక అంశానికి కమర్షియల్ అంశాలని జోడించి హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో శంకర్ తెరకెక్కించే సినిమాలని ఆదరించే వారు ప్రపంచ వ్యాప్తంగా ఉండటం విశేషం. అంతేకాదు హాలీవుడ్ దర్శకులు మెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

కాగా శంకర్ ప్రస్తుతం వరసగా సినిమాలని ప్రకటిస్తూ షాకిస్తున్నాడు. ఆయన సినిమా అంటే హీరో కనీసం రెండు మూడేళ్ళు లాకవుతాడు. ఇప్పటికే లోక నాయకుడు కమల్ హాసన్‌తో ఇండియన్ 2 పూర్తి చేయాల్సి ఉండగా.. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఒక పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించనున్నారు. ఇంకా ఈ సినిమా పట్టాలెక్కడనికి చాలా సమయం పడుతుందని సమాచారం. ఇంతలోనే బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో అపరిచితుడు హిందీ రీమేక్ తెరకెక్కించబోతున్నట్టు తాజాగా వెల్లడించారు. పెన్ స్టూడియోస్ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా 2005లో తమిళంలో అలాగే తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజైన్ సంచలన విజయాన్ని అందుకుంది. మరి ఇప్పుడు హిందీ రీమేక్ పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కిస్తాడా లేక కేవలం హిందీ భాషకే పరిమితమా అన్నది క్లారిటీ లేదని చెప్పుకుంటున్నారు.