Advertisement
Advertisement
Abn logo
Advertisement

వయసు ముప్ఫై ఏళ్లు. బరువు యాభై కేజీలే.. బరువు పెరగాలంటే?

ఆంధ్రజ్యోతి(17-09-2021)

ప్రశ్న: నాకు ముప్ఫై ఏళ్లు. ఎత్తు ఐదడుగుల ఆరంగుళాలు, బరువు మాత్రం యాభై కేజీలే. బరువు పెరిగేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?


- రేవతి, కొత్తగూడెం


డాక్టర్ సమాధానం: బరువు పెరగాలి అంటే మన శరీరానికి అవసరమైన దాని కంటే ఎక్కువ ఆహారం తీసుకోవాలి. అయితే ఇది ఆరోగ్యవంతమైనది మాత్రమే కావాలి. లేదంటే అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు బాగా వేయించిన ఆహారం, ఎక్కువ తీపి పదార్థాలు, కొవ్వులు ఉన్న మాంసం లాంటి వాటిని పరిమితంగా తీసుకోవాలి. మీ బరువు నెలకు రెండు నుంచి మూడు కేజీల వరకు పెరగాలంటే, రోజుకు అరలీటరు పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవాలి. రెండు గుడ్లు, రెండు వందల గ్రాముల చికెన్‌ లేదా చేప తీసుకోవచ్చు. కనీసం రెండు మూడు కప్పుల కాయగూరలు లేదా ఆకుకూరలు తీసుకోవాలి. అంతే కాకుండా రోజులో రెండు సార్లు స్నాక్స్‌గా పళ్ళు, బాదం, ఆక్రోట్‌ లాంటి గింజలు తినాలి. ఓ గుప్పెడు వేరుశెనగపప్పు తీసుకున్నా మంచిదే. ఓ అరగంట వ్యాయామానికి కేటాయిస్తే తీసుకున్న ఆహారం వంటబట్టి బరువు పెరగడానికి ఉపయోగ పడుతుంది. బరువు పెరిగేందుకు నిద్ర కూడా చాలా అవసరం. రోజుకు కనీసం ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకుంటే మంచిది. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

[email protected]కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement