Abn logo
Sep 18 2021 @ 00:12AM

ఎంత దారుణం..!

ఈ ఫొటోలోని వ్యక్తి నందవరం మండలం కనకవీడుకు చెందిన రాజు. జ్వరం, దగ్గు, ఆయాసం, ఫిట్స్‌తో తీవ్రంగా బాధపడుతూ.. రెండు రోజుల క్రితం కర్నూలు పెద్దాసుపత్రికి వచ్చాడు. 5వ నెంబర్‌ మేల్‌ మెడికల్‌ వార్డులో బాధితుడికి వైద్యం ఇలా అందుతోంది. ఎంత దారుణం..! పేరుకే పెద్దాసుపత్రి. రాయలసీమ, తెలంగాణ, కర్ణాటకలోని పలు జిల్లాల వారికి వైద్య సేవలు అందించే కీలకమైన ఆస్పత్రి. కానీ ఇక్కడ రోగులకు తగినన్ని పడకలు లేవు. గత్యంతరం లేక ఇలా నేలపై పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో సహజంగానే ఆస్పత్రులలో రద్దీ పెరుగుతుంది. అధికారులు అదనపు పడకలు ఏర్పాటు చేయాల్సిందిపోయి.. ఇలా నేలపై పడుకోబెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇలా చేస్తే.. ఉన్న రోగాలకు అదనపు వ్యాధులు తోడవుతాయి తప్ప.. రోగి కోలుకునేది ఎప్పుడు..?

- కర్నూలు(హాస్పిటల్‌)