ఉంగుటూరు, జనవరి 17 : నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద నివేశనాస్థలాలు పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చే ప్రక్రియలో భాగంగా గన్నవరం నియోజకవర్గంలోని అన్ని సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు సోమ, మంగళ వారం ఇళ్లనిర్మాణం తీరుతెన్నులు, విధివిధానాలపై గన్నవరం ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఉంగుటూరు ఎంపీడీవో కె.జ్యోతి తెలిపారు. నూజివీడు డీఎల్డీఓ గౌసియాబేగం ఉత్తర్వుల మేరకు రెండురోజులపాటు ఉదయం 9గం,లనుంచి సాయంత్రం 5గంటలవరకు శిక్షణాతరగతులు జరుగుతాయన్నారు.
విజయవాడరూరల్, గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లోని సచివాలయాల్లో పనిచేసే సుమారు 83మంది ఈసీలు ఈ శిక్షణలో పాల్గొంటారని తెలిపారు. ఆయా మండలాల ఎంఓటీలు, టీఓటీలు, ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈ, డీవైఈఈ, ఈఈ, లు శిక్షకులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.