Advertisement
Advertisement
Abn logo
Advertisement

సంపూర్ణ గృహ హక్కు పథకంతో రుణ విముక్తి

  • రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ సింహాచలం
  • ఓటీఎస్‌పై లబ్ధిదారులకు అవగాహన

గంగవరం, నవంబరు 30: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా గృహ నిర్మాణదారులు రుణ విముక్తులు కావాలని రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ కె.సింహాచలం కోరారు. మంగళవారం ఆయన మండలంలోని లక్కొండ, ఉమ్మెత్త గ్రామాల్లో పర్యటించి ఓటీఎస్‌పై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. లక్కొండలో రూ.10వేలు చెల్లించిన ఏట్ల లక్ష్మికి రుణవిముక్తి పత్రాన్ని అందజేశారు. తహశీల్దార్‌ శ్రీమన్నారాయణ మాట్లాడుతూ మండలంలో 243 మంది లబ్ధిదారులు ఉండగా 18 మంది రూ.10వేల చొప్పున రుణం చెల్లించారని తెలిపారు. 

Advertisement
Advertisement