Advertisement
Advertisement
Abn logo
Advertisement

గంటలోపే.. చుట్టేశారు

న్యూజిలాండ్‌167 ఆలౌట్‌ 

తిప్పేసిన జయంత్‌ యాదవ్‌

372 పరుగులతో  భారత్‌ రికార్డు విజయం

1-0తో సిరీస్‌ కైవసం


కనీసం భోజన విరామం వరకైనా న్యూజిలాండ్‌ నిలుస్తుందనుకుంటే స్పిన్నర్‌ యాదవ్‌ తిప్పేశాడు. దాంతో 12 ఓవర్లలోనే పర్యాటక జట్టు చేతులెత్తేసింది. కేవలం 43 నిమిషాల్లోనే న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 167 పరుగులకు ముగిసింది. ఫలితంగా భారత్‌ 372 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయం అందుకుంది. రెండు టెస్ట్‌ల సిరీ్‌సను 1-0తో కైవసం చేసుకుంది. అంతేకాదు టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో కోహ్లీసేన మొదటి స్థానానికి దూసుకొచ్చింది. మరోవైపు కివీస్‌కు ఇది అతి పెద్ద టెస్ట్‌ పరాజయం కావడం గమనార్హం.


ముంబై: గత టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. తాజా చాంపియన్‌షి్‌పలో..కివీ్‌సతో వాంఖడే స్టేడియంలో సోమవారం ముగిసిన రెండో టెస్ట్‌లో భారత్‌ ఏకంగా మూడు వందలకుపైగా పరుగులతో ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ 140/5 స్కోరుతో నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ 167 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ (60), నికోల్స్‌ (44), రచిన్‌ (18) రాణించారు. జయంత్‌ యాదవ్‌ (4/49) కెరీర్‌ బెస్ట్‌ బౌలింగ్‌తో సత్తా చాటాడు. అశ్విన్‌ (4/34) నాలుగు వికెట్లు సాధించాడు. మయాంక్‌ అగర్వాల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. అశ్విన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలిచాడు. 


జయంత్‌ మాయ: కిందటి రోజు నాటౌట్‌ బ్యాటర్లు నికోల్స్‌, రచిన్‌ సోమవారం ఉదయం 20 నిమిషాలపాటు అశ్విన్‌, జయంత్‌ యాదవ్‌ను ప్రతిఘటించారు. ఇద్దరు భారత స్పిన్నర్లు సుడులు తిరిగే బంతులతో నికోల్స్‌, రచిన్‌ను బెంబేలెత్తించారు. అయితే జయంత్‌ ఆఫ్‌స్టంప్‌ ఆవలిగా షార్ట్‌ బంతులు వేయడంతో రచిన్‌ ఫోర్లతో బదులిచ్చాడు. ఈక్రమంలో అతడు జయంత్‌ బౌలింగ్‌లో ఓసారి ఎల్బీ అయ్యే ప్రమాదాన్ని అంపైర్‌ నిర్ణయంతో తప్పించుకున్నాడు. భారత్‌ కనుక ఈ నిర్ణయంపై సమీక్ష కోరితే రచిన్‌ కచ్చితంగా పెవిలియన్‌ చేరేవాడని తర్వాత బాల్‌ ట్రాకింగ్‌లో స్పష్టమైంది. ఆపై జయంత్‌ బౌలింగ్‌లోనే.. బంతి రచిన్‌ బ్యాటును ముద్దాడుతూ రెండో స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న పుజార చేతిలోకి వెళ్లింది. అలా భారత విజయానికి బాటలు వేసిన జయంత్‌..తన తదుపరి ఓవర్లో జేమిసన్‌ (0), సౌథీ (0)లను, మరుసటి ఓవర్లో సోమర్‌ విల్లే (1) అవుట్‌ చేసి కివీ్‌సకు షాక్‌లపై షాకులిచ్చాడు. ఇక నికోల్స్‌ను కీపర్‌ సాహా అద్భుత స్టంపింగ్‌తో పెవిలియన్‌కు చేర్చి ప్రత్యర్థి ఇన్నింగ్స్‌కు అశ్విన్‌ ముగింపు పలకగా.. భారత జట్టు ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. 

విరాట్‌  అరుదైన రికార్డు

కివీస్‌పై టెస్ట్‌ విజయంతో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. మూడు ఫార్మాట్లలోనూ 50 అంతర్జాతీయ మ్యాచ్‌లు నెగ్గిన తొలి ఆటగాడిగా నిలిచాడు. టెస్ట్‌ల్లో కోహ్లీకిది 50వ మ్యాచ్‌ విజయం కాగా.. అతను ఇప్పటికే వన్డేల్లో 153, టీ20ల్లో 59 విజయాలు అందుకున్నాడు. 


భారత్‌లో ఆడిన 12 టెస్ట్‌ సిరీ్‌సలలో న్యూజిలాండ్‌ ఒక్కసారి కూడా సిరీస్‌ విజయం అందుకోలేకపోవడం గమనార్హం. 

స్వదే శంలో భారత్‌ టెస్ట్‌ సిరీస్‌ విజయాల సంఖ్య. 

టెస్ట్‌ల్లో ఈ ఏడాది అశ్విన్‌ పడగొట్టిన వికెట్ల సంఖ్య. ఓ కేలండర్‌ ఇయర్‌లో 50, అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం అశ్విన్‌కిది నాలుగోసారి. 

న్యూజిలాండ్‌పై టెస్ట్‌ల్లో అశ్విన్‌ వికెట్ల సంఖ్య ఇది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రిచర్డ్‌ హ్యాడ్లీ (65)ని అశ్విన్‌ అధిగమించాడు. 

స్వదేశంలో టెస్ట్‌ల్లో వేగంగా (49 మ్యాచుల్లో) 300 వికెట్ల క్లబ్‌లో చేరిన రెండో బౌలర్‌ అశ్విన్‌. మురళీధరన్‌ (48 మ్యాచుల్లో) టాప్‌లో ఉండగా.. కుంబ్లే (52 మ్యాచుల్లో)ది మూడోస్థానం. 

ఈ మ్యాచ్‌లో కివీస్‌ బౌలర్‌ ఎజాజ్‌ పటేల్‌ బౌలింగ్‌ గణాంకాలివి. ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా చరిత్ర సృష్టించిన ఎజాజ్‌.. ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌పై అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్‌గా నిలిచాడు.  


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 325; 

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 276/7 డిక్లేర్డ్‌; 

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 62;

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: లాథమ్‌ (ఎల్బీ) అశ్విన్‌ 6, యంగ్‌ (సి) సబ్‌ ఎస్‌ఏ యాదవ్‌ (బి) అశ్విన్‌ 20, మిచెల్‌ (సి) జయంత్‌ (బి) అక్షర్‌ 60, రాస్‌ టేలర్‌ (సి) పుజార (బి) అశ్విన్‌ 6, నికోల్స్‌ (స్టంప్డ్‌) సాహా (బి) అశ్విన్‌ 44, బ్లండెల్‌ (రనౌట్‌) 0, రచిన్‌ (సి) పుజార (బి) జయంత్‌ యాదవ్‌ 18, జేమిసన్‌ (ఎల్బీ) జయంత్‌ యాదవ్‌ 0, సౌథీ (బి) జయంత్‌ యాదవ్‌ 0, సోమర్‌విల్లే (సి) మయాంక్‌ (బి) జయంత్‌ యాదవ్‌1, ఎజాజ్‌ పటేల్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు 12, మొత్తం 56.3 ఓవర్లలో 167 ఆలౌట్‌. వికెట్లపతనం : 1/13, 2/45, 3/55, 4/128, 5/129, 6/162, 7/165, 8/165, 9/167, 10/167 బౌలింగ్‌: సిరాజ్‌ 5-2-13-0, అశ్విన్‌ 22.3-9-34-4, అక్షర్‌ పటేల్‌ 10-2-42-1, జయంత్‌ యాదవ్‌ 14-4-49-4, ఉమేశ్‌ యాదవ్‌ 5-1-19-0. Advertisement
Advertisement