Abn logo
Sep 17 2021 @ 00:28AM

వైద్యశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి

చినగంజాం పీహెచ్‌సీ పరిసరాలను పరిశీలిస్తున్న జేసీ చేతన్‌

 జాయింట్‌ కలెక్టర్‌ చేతన్‌

చినగంజాం, సెప్టెంబరు 16: ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల పరిసరా లను పరిశుభ్రంగా ఉంచాలని జాయింట్‌ కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ అన్నా రు. గురువారం మండలంలోని చినగంజాం, సంతరావూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కడవకుదురు, సంతరావూరు సచివాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయాల ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న సేవలను ప్రజలకు వివరించాలని సిబ్బందికి సూచించారు. పీహెచ్‌సీల పరి ధిలో ఎంత మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేశారు, వ్యాక్సిన్‌ వేయించుకున్న వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం జరిగే మేగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కడవకుదు రు, సంతరావూరు గ్రామ సచివాయ రికార్డులను, సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. 

కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ఏవీఎస్‌ శాస్త్రి, తహసీల్దార్‌ యు.శ్రీనివాసరావు, ఎంపీడీవో డి.విజయలక్ష్మి, వైద్యాధికారి ఎస్‌.విజయ భాస్కరరావు, ఈవోపీఆర్డీ కె.స్వరూపరాణి, ఏఈ డి.దాసు, గ్రామ కార్య దర్శులు పీ.శ్రీనివాసరావు, ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.