Abn logo
Apr 1 2020 @ 16:29PM

ప్ర‌భాస్ కోసం హాస్పిట‌ల్ క‌ట్టేస్తున్నారట‌...!

యంగ్ రెబ‌ల్ స్టార్ త‌న 20వ సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో షూటింగ్ ఆగిపోవ‌డంతో రెస్ట్ తీసుకుంటున్నాడు. క‌రోనా ఎఫెక్ట్‌తో లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌క‌ముందే జార్జియా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇండియా చేరుకున్న ప్ర‌భాస్ టీమ్ తదుప‌రి షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటోంది. నిజానికి ప్ర‌భాస్ త‌దుప‌రి షెడ్యూల్‌ను ఇటలీలో ప్లాన్ చేశారు. కానీ క‌రోనా ప్ర‌భావం ఇట‌లీలో ఎక్కువ‌గా ఉండ‌టంతో అక్క‌డ వెళ్ల‌డాన్ని చిత్ర యూనిట్ విర‌మించుకుంది. దీంతో ఇటలీలో షూట్ చేయాల్సిన షెడ్యూల్‌ను హైద‌రాబాద్‌లోనే సెట్స్ వేసి చిత్రీక‌రించాల‌నుకుంటున్నార‌ట‌. ఇప్ప‌టికే ఈ సినిమా కోసం అన్న‌పూర్ణ స్టూడియోలో మూడు భారీ సెట్స్ వేశారు. ఇప్పుడు మ‌రో హాస్పిట‌ల్ సెట్‌ను కూడా వేస్తున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అనుకుంటున్నాయి. ప్ర‌భాస్ జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌. ‘జిల్’ పేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ఓ మైడియ‌ర్‌’, ‘రాధేశ్యామ్’ అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు టాక్‌.

Advertisement
Advertisement
Advertisement