Abn logo
Jul 13 2020 @ 15:11PM

కరోనా కాలం.. ఆస్పత్రి ఫీజుల భారం

లాక్‌డౌన్‌ సాకుతో ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యం

ధరల పట్టికలు అమలు చేయని యాజమాన్యాలు

ఓపీ, ఆపరేషన్‌ ఫీజులు, బెడ్‌ చార్జీలు అమాంతంగా పెంచిన వైనం

హడలెత్తిపోతున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలు

పట్టించుకోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు


మహబూబ్‌నగర్‌ (వైద్య విభాగం): కరోనా కాసుల వర్షం కురిపిస్తోంది. అనుకోని విధంగా ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఆదాయం తెచ్చిపెడుతోంది. లాక్‌డౌన్‌ను అడ్డంపెట్టుకొని యాజమాన్యాలు ఫీజులు పెంచి సామాన్య మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆసుపత్రి స్థాయిని బట్టి డబ్బులు గుంజుతూ పేదల జేబును ఖాళీ చేస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తుందో అర్థంగాని పరిస్థితి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఆసుపత్రుల్లో ఎక్కడా కూడా ధరల నియంత్రణ పట్టికే కనిపించడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు సైతం నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌ చర్యలు తీసుకొని ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


కరోనా వైరస్‌ ప్రజలను అతలాకుతలం చేస్తోంది. వైరస్‌ వ్యాప్తితో రోజు రోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రంగా నష్ట పోయామంటూ ప్రైవేట్‌ ఆసుప త్రులు ఓపీ ఫీజులు, ఆపరేషన్‌ చార్జీ లు, బెడ్‌ చార్జీలు అడ్డగోలుగా పెంచే శాయి. ఆసుపత్రి స్థాయిని బట్టి  ఫీజులు నిర్ణయించి ఒకటికి రెండింత లు చేశారు. ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖ ధరల నియంత్రణ కమిటీ నిబంధనలను తుంగలో తొక్కుతున్నా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో అడ్డగోలు పెంచిన ఫీజులు, చార్జీలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..


ఓపీ చార్జీల పెంపు..

జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో స్థాయిని బట్టి లాక్‌డౌన్‌ కంటే ముందు ఓపీ ఫీజు రూ.100 నుంచి రూ.200 వరకు ఉండేది. అయితే అన్ని ఆసుపత్రులు ఓపీ ఫీజును అమాంతంగా పెంచేశాయి. ప్రస్తుతం ఒక్కో ఆసుపత్రిలో రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ఓ ప్రధాన ఆసుపత్రిలో ఓపీ ఫీజు లేకుండా ఉచితంగా చూసేవారు. ప్రస్తుతం రూ.100 వసూలు చేస్తున్నారు. 


ఆపరేషన్‌ చార్జీల ధరలకు రెక్కలు..

అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆపరేషన్‌ చార్జీల ధరల కు రెక్కలొచ్చాయి. ఒక్కో ఆసుపత్రిలో వారి స్థాయిని బట్టి ఫీజులు, బెడ్‌ చార్జీలు పెంచారు. లాక్‌డౌన్‌కంటే ముందు సిజేరియన్‌ ఆపరేషన్‌కు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేసేవారు. ప్రస్తుతం రూ.40 వేల నుంచి రూ.90 వేల వరకు పెంచారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మరో ప్రైవేటు వైద్య కళాశాల ఆసుపత్రిలో గతంలో సిజేరియన్‌కు రూ.12 వేలు, నార్మల్‌ డెలీవరికి రూ.6 వేలు ఫీజు ఉండేది. నేడు రెండింతలు చేశారు. ఆర్థోపె డిక్‌ ఆపరేషన్‌కు రూ.30వేల వరకు వసూలు చేసేవారు. ఇప్పుడు రూ.60 వేల నుంచి రూ. లక్ష వరకు కూడా వసూలు చేస్తున్నారు. అపెండిక్స్‌ ఆపరేషన్‌కు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు తీసుకునే వారు. కానీ ఇప్పుడు రూ.50 వేల నుంచి రూ.90 వేల వరకు తీసుకుంటున్నారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కుదేలైపోతున్నాయి.


ఎక్కడెక్కడ ..

మరికల్‌ మండలం పూసల్‌పాడు గ్రామానికి చెందిన ఓ గర్భిణి కాన్పు కోసం జిల్లా కేంద్రానికి వచ్చింది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సిజేరియన్‌ చేయడానికి రూ.65 వేలు ఖర్చు అవుతుందని చెప్పడంతో వెనుదిరిగి మరో ఆసుపత్రిలో రూ.40వేలకు సిజేరియన్‌ చేయించుకుంది.


జడ్చర్ల మండల కేంద్రానికి చెందిన ఓ గర్భిణిని కాన్పు కోసం జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో గల ఓ ఆసుపత్రికి తీసుకొస్తే సిజేరియన్‌ ఆపరేషన్‌కు రూ.95 వేలు ఖర్చు అవుతుందని చెప్పారు.


సీసీ కుంట మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడికి అపెండిక్స్‌ ఆపరేషన్‌ చేయడానికి జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసు వద్ద గల ఓ ఆసుపత్రి యాజ మాన్యం రూ.90 వేలు ఫీజు వసూలు చేసింది.


- హన్వాడ మం డలం బుద్దారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ప్రమా దంలో కాలు విరిగితే జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రికి తీసుకొ చ్చారు. రూ.70 వేలు తీసుకొని ఆపరేష న్‌ చేశారు.


పట్టించుకోని అధికారులు

జిల్లా కేంద్రం లోని అన్ని ప్రైవే టు ఆసుపత్రులు అడ్డగోలుగా ఫీజు లు, చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపు తున్నా వైద్య, ఆరోగ్య శాఖకు మాత్రం పట్టడం లేదు. ఫీజుల దోపిడీని అరికట్టాలని ఓ ట్రేడ్‌ యూనియన్‌తో పాటు కొన్ని ప్రజా సంఘాలు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీంతో ప్రైవేటు ఆసుపత్రు ల యాజమాన్యాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలను పిలిపించి ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వ హించాల్సి ఉంటుంది. అందులో నిర్ణయించిన ప్రకారం ఫీజులు వసూలు చేయాలి. అంతేకాకుండా ప్రతి ఆసుపత్రిలో సేవలకు సంబంధించిన ధరల పట్టికను కనిపిం చేవిధంగా ఏర్పాటు చేయాలి. ఈ నిబంధనలు ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ ఽఫీజులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతై నా ఉంది.

Advertisement
Advertisement