Abn logo
Jan 18 2021 @ 00:51AM

మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్యకు సత్కారం

చల్లపల్లి, జనవరి 17 : మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్యను ఆదివారం పలువురు ప్రముఖులు కలుసుకున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన సంక్రాంతి సందర్భంగా చింతలమడలోని బంధువుల ఇంటికి వచ్చారు. టీడీపీ నాయకుడు యార్లగడ్డ శ్రీనివాస రావు, విశ్రాంత ఈవోఆర్డీ దాసి సీతారామరాజు, రెడ్‌క్రాస్‌ చల్లపల్లి సబ్‌ బ్రాంచ్‌ చైర్మన్‌ నడకుదురు లీలాబ్రహ్మేంద్ర తదితరులు రామయ్యను కలిసి సత్కరించి నూతన వస్త్రాలను అందజేశారు. విశ్రాంత డీఎస్పీ కె.హరి రాజేంద్రబాబు పాల్గొన్నారు. 




Advertisement
Advertisement
Advertisement