Abn logo
Sep 30 2020 @ 02:22AM

అజయ్‌ కోసం హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్‌

Kaakateeya

‘డార్క్‌నైట్‌’, ‘డంకిర్క్‌’ లాంటి చిత్రాలకు పనిచేసిన  హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ టామ్‌ స్ట్రూతర్స్‌ బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌ నటిస్తోన్న యాక్షన్‌ డ్రామా చిత్రానికి పనిచేయనున్నార ని సమాచారం. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోన్న చిత్రంలో అజయ్‌ దేవ్‌గణ్‌ విలన్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తారు. అనన్యాపాండే సోదరుడు అహాన్‌ పాండే హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం భారీఎత్తున యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించేలా ప్లాన్‌ చేస్తున్నారు నిర్మాత ఆదిత్యాచోప్రా. దానికోసం హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ టామ్‌ స్ట్రూతర్స్‌తో, కొరియన్‌  యాక్షన్‌ డైరెక్టర్‌ ‘సీ యంగ్‌ ఓ’తో చర్చలు జరుపుతున్నారు.  ప్రస్తుతం అజయ్‌ దేవ్‌గణ్‌ ‘మైదాన్‌’ చిత్రం షూటింగ్‌లో ఉన్నారు. దాన్ని త్వరగా ముగించి కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాలనే ఆలోచనలో ఉన్నారు.  

Advertisement
Advertisement
Advertisement