Advertisement
Advertisement
Abn logo
Advertisement

హెచ్‌ఐవీ రహిత సమాజమే లక్ష్యం

కోవూరు, డిసెంబరు 1 : హెచ్‌ఐవీ రహిత సమాజ నిర్మాణ లక్ష్యంగా వైద్యసిబ్బంది ప్రచారం చేయాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి మురళీఽధర్‌ కోరారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా ఇనమడుగులో బుధవారం జరిగిన ప్రదర్శనలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువతీ యువకులు హెచ్‌ఐవీ వ్యాధిని అంతమొందించేందుకు వీలుగా గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో  వైద్యాధికారులు ఇర్ఫాన్‌, రవిబాబు మాట్లాడారు. ప్రదర్శనలో వైద్యసిబ్బంది, జడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు పాల్గొన్నారు. 

ఆర్‌ఎంపీలకు సన్మానం : హెచ్‌ఐవీ నిరోధక కార్యక్రమాలను చేపడుతున్న పట్టణానికి చెందిన ఆర్‌ఎంపీలను నెల్లూరులోని టౌన్‌హాల్లో ఘనంగా సన్మానించారు. పట్టణానికి చెందిన కే రవీంద్రబాబు, గౌస్‌బాషాలను జేసీ గణేష్‌కుమార్‌, వైద్యశాఖాధికారిణి రమాదేవి అభినందించారు. సన్మానం పొందిన ఆర్‌ఎంపీలను వారి బంధుమిత్రులు అభినందించారు. 

Advertisement
Advertisement